Thursday, December 14, 2006

మంచు ముత్యాలతో

మంచు ముత్యాలతో స్నానించి
పరిమిళిస్తోన్న గులాబీని పలకరించాను.
"ఇంత అందమైన నీ మేను పై ఈ ముళ్ళెందుకు?" అన్నాను
ముళ్ళు లేని గులాబీ కూడా ఉందంది తాను...
.. కళ్ళ ముందు నీ రూపం మెదిలింది

**********
రాత్రి కలలో కొచ్చిన నిన్ను
కనురెప్పల మాటున బంధించేచానుగదా...
ఇంత జాణతనం ఎప్పుడు నేర్చుకున్నావ్...
తెల్లవారేటప్పటికి జారుకున్నావ్ !!

***********
నీ సమక్షంలో
మౌనం సంగీతమవుతోంది
నీ విరహంలో
శబ్దం నిశ్శబ్దమవుతుంది
ప్రేమంటే ఇదేనా...
నీ తలపుతో మనసు పరవశమవుతోంది
!!

1 comment:

రాధిక said...

చిన్న చిన్న పదాల్లో హ్రుదయం నిండిపోయే అంత భావం.చాలా బాగున్నాయి.గులాబి బాల చాలా నచ్చింది.