Thursday, December 14, 2006

మంచు ముత్యాలతో

మంచు ముత్యాలతో స్నానించి
పరిమిళిస్తోన్న గులాబీని పలకరించాను.
"ఇంత అందమైన నీ మేను పై ఈ ముళ్ళెందుకు?" అన్నాను
ముళ్ళు లేని గులాబీ కూడా ఉందంది తాను...
.. కళ్ళ ముందు నీ రూపం మెదిలింది

**********
రాత్రి కలలో కొచ్చిన నిన్ను
కనురెప్పల మాటున బంధించేచానుగదా...
ఇంత జాణతనం ఎప్పుడు నేర్చుకున్నావ్...
తెల్లవారేటప్పటికి జారుకున్నావ్ !!

***********
నీ సమక్షంలో
మౌనం సంగీతమవుతోంది
నీ విరహంలో
శబ్దం నిశ్శబ్దమవుతుంది
ప్రేమంటే ఇదేనా...
నీ తలపుతో మనసు పరవశమవుతోంది
!!

Wednesday, December 13, 2006

నేనెక్కడ...?
ఆమె పాధమంజీరం ఘల్లని మ్రొగుతుంది
ఆ సవ్వడి నా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
ఆమె నవ్వు కోటి స్వరాల మేళనమై రవ లిస్తుంది
నా హృదయం నా ధగ్గర మాయమవుతుంది
దానికోసం నా ప్రపంచమంతా వెతుకుతాను, అగుపించద్ు
ఇంతలో తన పిలుపు వినిపిస్తుంధీ, వెళతాను
ఆశ్చర్యం...
నా హృదయం తన హృదయంలో మమేకమై కనిపిస్తుంధీ.
రాత్రి నిద్రలో చెవి దగ్గరగా ఏదో చప్ప్పుడు
కళ్ళు తెరిచి చూస్తే... తుంటరి చంద్రుడు
వెన్నెలను అత్తరులా నా వళ్ళంతా చల్లుతున్నాడు
ఎలా తెలుసుకున్నాడో ఈవేళా నీ దగ్గరాకొస్తున్నానని...